సంచలన దర్శకులు వి.వి.వినాయక్, రచనా బాహుబలి విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా “ఊర్వశి ఓటిటి” ప్రారంభమై 100 రోజులు దాటింది. వంద రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు ఊర్వశి చేరువైంది. ఈసందర్భంగా సంస్థ సీఈవో రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆనతికాలం లొనే ఊర్వశి ఓటిటి 40 లక్షల మంది మనసులు చూరగొంది. ప్రతి చిన్న నిర్మాతకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో… ఏవిధమైన అప్లోడింగ్ ఛార్జిస్ లేకుండా.. ఊర్వశి ద్వారా ప్రేక్షకులకు చేరవేస్తున్నాం. మా ఊర్వశి సిస్టర్ కన్సర్న్ సంధ్య స్టూడియో నుండి కెమెరాలు.. పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తున్నాము. సినిమా/వెబ్ సిరీస్ పూర్తి అయ్యాక తమకు నచ్చిన చోట అమ్ముకోవచ్చు. చిన్న బడ్జెట్ సినిమాలకి ఓటిటి ఒక వరం” అని అన్నారు.
ఊర్వశి ఓటిటి మేనేజింగ్ డైరెక్టర్ రవి కనగాల మాట్లాడుతూ... ఇప్పుడు తమిళ్-కన్నడలో కూడా మా ఊర్వశి సేవలు విస్తరించాం. చెన్నై-బెంగళూరులలో మా ప్రతినిధులను నియమించాం. అతి త్వరలో హిందీ-మలయాళం లో కూడా మా ఊర్వశి OTT సేవలు ప్రాంభించనున్నాం.
‘ప్రతి వారం ఒక కొత్త సినిమా’ అనే నినాదంతో ఊర్వశి ప్రాంభించాం. కానీ ఈ 100 రోజుల్లో 25 కొత్త సినిమాలు విడుదల చేసాం. ఊర్వశిలో తాజాగా లభ్యమవుతున్న ‘మిస్ లీలావతి, కళ, సమంత, బాలమిత్ర” వంటి చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. డిఫరెంట్ జోనర్స్ లో రూపొందిన మరో 20 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఊర్వశి ద్వారా ప్రసారమయ్యే సినిమాలు… మేక్స్ ప్లేయర్, వొడాఫోన్ వంటి వేదికల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువ కానున్నాయి” అన్నారు.