సీజన్ 5 వచ్చేది ఆ నెలలోనే…

నెట్ఫ్లిక్స్ ని ఇండియన్ సినీ అభిమానులకి దెగ్గర చేసిన సిరీస్ ఏదైనా ఉందా అంటే కళ్లు మూసుకోని మనీహీస్ట్ అని చెప్పొచ్చు. వెబ్ సిరీస్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని సమయంలో స్పానిష్ టీవీ షోని చూడడానికి అందరూ ఎగబడ్డారు. 2020లో ఓటీటీ వరల్డ్ లో అత్యధికంగా చూసిన ఏకైక వెబ్ సిరీస్ ‘మనీహీస్ట్‌’ అంటే ప్రేక్షకుల్లో ఈ సిరీస్ కి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మేకింగ్, థ్రిల్లింగ్ ట్విస్ట్స్ లో వచ్చిన ఈ సిరీస్ నిజానికి నెట్ ఫ్లిక్స్ వాల్యూనే కాదు మేకింగ్ స్టాండర్డ్స్ ని కూడా పెంచింది. ఇప్పటికే రిలీజ్ అయిన 4 సీజన్స్ హైయెస్ట్ వ్యూవ్స్ అందుకున్నాయి.

ప్రొఫెసర్ గ్యాంగ్ కి బాగా ఎట్రాక్ట్ అయిన అభిమానులను సీజన్ 5 కోసం ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి హై వోల్టేజ్ కంటెంట్ రెడీ చేస్తున్న మేకర్స్ ఈ సీజన్ 5ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సీజన్ 5 నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది కాబట్టి ప్రొఫెసర్ గ్యాంగ్ తో పాటు వస్తే మరోసారి స్ట్రీమింగ్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి అభిమానులు రెడీగా ఉన్నారు.