బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఫిక్స్?.. ఎప్పుడంటే?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా?.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్‌ మూడోస్థానానికి పరిమితమై బీజేపీ పుంజుకుని విజయం సాధించింది. దీంతో భవిష్యత్తులో కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. దీంతో కాంగ్రెస్‌లో ఉంటే తన రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండటంతో రేవంత్ బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

REVANTH REDDY

రేవంత్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్న విజయశాంతి, పలువురు కీలక నేతలు త్వరలో బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో వారందరూ టచ్‌లో ఉన్నారని, ఏ క్షణంలో అయినా చేరే అవకాశముందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, విజయశాంతి లాంటి కీలక నేతలు కూడా బీజేపీలో చేరితే కాంగ్రెస్ ఇంకా బలహీనపడే అవకాశముంది.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ఇప్పటినుంచే వ్యూహలు రచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించింది. పార్టీ మరింత బలపడాలంటే ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నేతలు అవసరం. అందుకే కాంగ్రెస్‌లోని కీలక నేతలను తమ వైపుకు తిప్పుకునే పనిలో బీజేపీ వర్గాలు బిజీగా ఉన్నాయి.