‘థాంక్యూ’ అంటున్న నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ముగియనున్న క్రమంలో తర్వాత చేయబోయే సినిమాను చైతూ ఫిక్స్ చేశాడు. మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో చైతూ తన తర్వాతి సినిమా చేయనుండగా.. దీనికి ‘థాంక్యూ’ అనే టైటిల్ పెట్టారు.

NAGA CHAITANYA

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. దీని కోసం ఇప్పటికే గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక పేరును ఫిక్స్ చేయగా.. మిగిలిన ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో సినిమా యూనిట్ ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలుకానుందని సమాచారం.

‘లవ్ స్టోరీ’ సినిమాపై చైతూ బాగా అంచనాలు పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన లుక్, టీజర్లు ప్రేక్షకులకు ఆకట్టుకోవడంతో ఈ సినిమా పక్కగా విజయం సాధిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.