పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ త్రిష‌

తెలుగు, త‌మిళంలో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది త్రిష‌. రెండు భాష‌ల్లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సినిమాలు చేయ‌క‌పోయినా.. కోలీవుడ్‌లో మాత్రం వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది ఈ భామ‌. 37 ఏళ్లు వ‌చ్చినా ఇంకా పెళ్లిచేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ‌. గ‌తంలో టాలీవుడ్ హీరో రానాతో ల‌వ్ ఎఫైర్ న‌డిపింద‌ని, అలాగే శింబుతో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింద‌నే వార్త‌లు అనేకం వినిపించాయి. గ‌తంలో చెన్నైకి చెందిన ఒక పారిశ్రామిక‌వేత్త‌తో త్రిష నిశ్చితార్థం జ‌ర‌గ్గా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ ఆ పెళ్లి వెన‌క్కి వెళ్లింది.

trisha

అయితే తాజాగా త‌న పెళ్లిపై త్రిష ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. తాను ల‌వ్ మ్యారేజ్ మాత్ర‌మే చేసుకుంటాన‌ని, న‌చ్చిన వ్య‌క్తి దొరికే వ‌ర‌కు వేచి చూస్తాన‌ని చెప్పింది. త‌న మ‌న‌స్సుకు న‌చ్చిన వ్య‌క్తి దొరిక‌తే ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకుంటానంది. త‌నను అర్థం చేసుకునే వ్య‌క్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాన‌ని త్రిష త‌న మ‌నస్సులోని మాట‌ల‌ను తాజాగా బ‌య‌ట‌పెట్టింది.

న‌చ్చిన వ్య‌క్తి దొరికేవ‌ర‌కు సింగిల్‌గానే ఉంటాన‌ని, అలాంటి వ్య‌క్తి దొర‌క్క‌పోతే జీవితాంతం ఒంట‌రిగా ఉంటాన‌ని త్రిష తెలిపింది. పెళ్లి చేసుకోకుండా ఉండే ధైర్యం కూడా తనకి ఉందని, ఆడవాళ్లు ఏదైనా సాధించ గలుగుతారని త్రిష చెప్పుకొచ్చింది.