
వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో హేమంత్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ హారర్ కామెడీ చిత్రం “ఫన్” నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది.
ఈ సినిమాని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. కళ్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ ముఖ్య పాత్రలను పోషించానున్నారు.
ఈ సినిమాకి సంగీతం రామ్ గోపాల్ అందించనున్నారు. జి.ఎల్ బాబు కెమెరామెన్‌గా, క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్లను అందించేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.
నటీనటులు : కళ్యాణ్ పడాల, సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్
నిర్మాత : జి. సంతోషి రెడ్డి
దర్శకుడు : హేమంత్ కృష్ణ
సంగీతం : రామ్ గోపాల్
కెమెరా : జి.ఎల్. బాబు
ఎడిటర్ : క్రాంతి (ఆర్.కె.)
కొరియోగ్రాఫర్ : జె. చంద్ర కిరణ్
స్టంట్స్ : వై. రవి
పీఆర్వో : సాయి సతీష్
డిజిటల్ టీం : స్టార్ సర్కిల్


