సాయి దుర్గ తేజ్ – కిరణ్‌ల నిశ్చితార్థం – డిసెంబర్ 10న వివాహం

మెగా హీరో సాయి దుర్గ తేజ్, కిరణ్‌లు కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 5, గురువారం హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన సభ్యులు, బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

సాయి దుర్గ తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్‌తో పాటు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు బాబీ, నీలా షా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వారి కుమారుడు వాయువ్ తేజ్, నాగబాబు, పద్మజ, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్, నిర్మల, అల్లు శిరీష్, నయనికా రెడ్డి, అకీరా నందన్, ఆద్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, నవదీప్, హర్షిత్ రెడ్డి తదితర సన్నిహితులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

సాయి దుర్గ తేజ్, కిరణ్‌ల వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌లో జరగనుంది.

Related Articles

Latest Articles