
‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వారి వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ‘ఛప్రి’ మూవీని తెరకెక్కించారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథలో చివరకు ఏం జరుగుతుంది? అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతని ప్రేమలో విజయం సాధిస్తాడా? లేదా? అన్నది ‘ఛప్రి’ మూల కథ. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని తాజాగా విడుదల చేశారు.
‘ఛప్రి’ ఫస్ట్ లుక్‌లో సరోజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో హీరో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: సరోజ్, ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్: BSK మెయిన్ స్ట్రీమ్
కథ – స్క్రీన్‌ప్లే – సంభాషణలు – సాహిత్యం – ఎడిటింగ్ – సంగీతం – దర్శకత్వం: సరోజ్
నిర్మాతలు: సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ గూడూరి
సినిమాటోగ్రఫీ: రమేష్ మర్రెపల్లి
ఆర్ట్ : నాని దేవరపల్లి
పబ్లిసిటీ డిజైన్ : అనిల్ – భాను
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మాడూరి మధు
కాస్ట్యూమ్ డిజైనర్: అజయ్ జాయ్


