
రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “చంద్రయాన్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే చంద్రుడి మీదకు తమ స్పేస్ క్రాఫ్ట్ లను పంపగలిగాయి. అలాంటి ప్రయత్నం మందమర్రి అనే చిన్న గ్రామంలో లెక్కలు, ఎక్కాలు రాని నలుగురు కుర్రాళ్లు చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ హ్యూమర్ ను సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతోంది “చంద్రయాన్” మూవీ. ఆ ఫన్ కు చిన్న శాంపిల్ ఇచ్చింది ట్రైలర్.
“చంద్రయాన్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – గూగుల్ సాయంతో రాకెట్ తయారుచేసి చంద్రుడి మీదకు వెళ్లేందుకు నలుగురు కుర్రాళ్లు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ దెబ్బతో ఊరంతా తమ వైపు, ప్రపంచమంతా తమ ఊరి వైపు చూడాలనుకుంటారు. ఆ రాకెట్ లో ఇంధనం కోసం తవుడు, ఆ వాతావరణంలో బతుకుతుందో లేదో టెస్ట్ చేసేందుకు కోడిని అద్దెకు తీసుకొస్తారు. సైన్స్ కే ట్విస్టులు ఇచ్చే ఈ సైంటిస్టులు చేసే రాకెట్ ప్రయోగం ఊరికి కీడుగా గ్రామస్థులు భావిస్తారు. ఈ క్రమంలో ఊరిలో హత్య కేసు ఉదంతం వెలుగులోకి రావడం, బాబా భాస్కర్ క్యారెక్టర్ ను పరిచయం చేయడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఎవరూ తమ ప్రయత్నాన్ని నమ్మని, ప్రోత్సహించని పరిస్థితుల్లో తమకు దొరికిన వస్తువులతో ఈ నలుగురు కుర్రాళ్లు రాకెట్ ఎలా తయారుచేశారు? చంద్రయానం ఎలా చేశారు? అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
నటీనటులు – శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ, తదితరులు
టెక్నీషియన్స్
కాస్ట్యూమ్ డిజైనర్ – శశి కోసూరి
ఎడిటర్ – పుల్లారావు దాసరి
ప్రొడక్షన్ డిజైనర్స్ – శ్రీధర్ మేస్త్రి, మందర్ పస్నేకర్
డీవోపీ – శ్రీనివాస. బి.
మ్యూజిక్ – హర్ష ప్రవీణ్
సమర్పణ – వేణు ఊడుగుల
ప్రొడ్యూసర్ – ప్రవీణ్ మొలక
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – శ్రీనాథ్ చంద్రశేఖర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)


