‘సర్కారు వారి పాట’ కోసం.. అప్పుడే 35కోట్ల డీల్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ కూడా అంతకంటే హై రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ అనే లుక్ తో కనిపించనున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే బిజినెస్ డీల్స్ పై చర్చలు జరుగుతున్నాయట. సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా సినిమాకి 35కోట్ల వరకు లాభాలు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి. అక్టోబర్ చివరలో లేదా నవంబర్ మొదటి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది ఎలాగైనా విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని మహేష్ ఆలోచిస్తున్నాడట.