బిగ్‌బాస్-4ను వెంటాడుతున్న కష్టాలు… ఉంటుందా?.. ఉండదా?

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4ను కష్టాలు వెంటాడుతున్నాయి. టీఆర్‌పీ రేటింగ్స్ భారీగా పడిపోవడంతో నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీకెండ్స్‌లో రేటింగ్స్ మరింత దారుణంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది. వీకెండ్స్‌లో హీరో నాగార్జున వచ్చి హోస్టింగ్ చేస్తున్నా, మంచి ఆసక్తికరమైన టాస్క్‌లను బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్ ప్రవేశపెట్టినా రేటింగ్స్ మాత్రం రావడం లేదట.

bigboss

సమంత దసరా రోజున హోస్ట్ చేసిన ఏపిసోడ్‌కు 11.4 టీఆర్‌పీ రేటింగ్ రాగా.. ఇప్పుడు వీకెండ్స్‌లో 5.5 మాత్రమే వస్తుంది. మాములుగా వీకెండ్స్‌లో ఎప్పుడూ టీఆర్‌పీ రేటింగ్ 9 ఉంటుంది. భారీగా రేటింగ్ తగ్గడంతో మరిన్ని ఆసక్తికర టాస్క్‌లను కంటెస్టెంట్స్‌తో చేయించాలని క్రియేటివ్ టీమ్ చూస్తందట.

షెడ్యూల్ ప్రకారం ఈ నెలతో బిగ్‌బాస్ షో కంప్లీట్ అవుతాది. కానీ టీఆర్‌పీ రేటింగ్స్ తక్కువగా వస్తుండటంతో మరో నాలుగు వారాల పాటు షోను పొడిగించాలని నిర్వహకులు ఆలోచిస్తున్నారట. ఇదే జరిగితే డిసెంబర్ చివరి కల్లా బిగ్‌బాస్ షో పూర్తి కానుంది.