షూటింగ్‌లో ప్రమాదం: స్టార్ హీరోకు గాయాలు

ఒకప్పుడు చిన్నపాటి యాక్షన్ సన్నివేశాలు చేయాలన్నా సరే.. డూప్‌లను ఎక్కువగా వాడేవాళ్లు. యాక్షన్ సన్నివేశాలు చేయడానికి హీరోలు, నటులు భయపడేవాళ్లు. డూప్ పెట్టి చేస్తే అభిమానులు సులువుగా గుర్తు పడతారు. డూప్ పెట్టి చేస్తే యాక్షన్ సన్నివేశాల్లో అభిమానులకు అంతగా కిక్కు ఉండదు. కానీ ఇప్పుడు కాలం మారింది. యాక్షన్ సీన్లలో స్వయంగా హీరోలే నటిస్తున్నారు. అడ్వెంచర్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హీరోల యాక్షన్ సీన్లను కూడా అభిమానులు ఇష్టపడుతున్నారు.

aarya injury

ఇలాంటి యాక్షన్ సీన్లలో హీరోలు నటించేటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు చాలా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఒక హీరో సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా వస్తున్న ‘విలన్’ సినిమాలో ఆర్య విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతోంది. కానీ ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్‌ను చెన్నైలో షూట్ చేస్తున్నారు.

ఈ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఒక యాక్షన్ సీన్‌లో ఆర్య జంపింగ్ చేస్తుండగా.. కింద పడ్డారట. దీంతో ఆర్యకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆర్యకు చికిత్స అందించగా.. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాడు.