బిగ్‌బాస్ 4 ఫైనల్‌కు రికార్డు TRP రేటింగ్స్

బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే ఎంత గ్రాండ్‌గా జరిగిందో మనందరం చూశాం. హీరోయిన్ల డ్యాన్స్ ఫర్‌ఫామెన్స్‌లు, గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి చేసిన సందడి అసలు మాములుగా లేదు. గ్రాండ్ ఫినాలే రోజు బిగ్‌బాస్ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో పాటు టాప్ 5 కంటెసెంట్స్ ఫ్యామిలీ కూడా ఫైనల్‌కి వచ్చింది. దీంతో బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా జరిగింది.

bigboss 4 trp ratings

దీంతో గ్రాండ్ ఫినాలేకు భారీ TRP రేటింగ్స్ వచ్చాయి. ఏకంగా 19.51 టీఆర్పీ రేటింగ్స్‌తో ఈ ఎపిసోడ్ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. చివరి నిమిషం వరకు గెస్ట్ ఎవరనేది తెలియకపోవడం, మధ్యలో టిస్టులతో ఈ ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మధ్యలో డైరెక్టర్ అనిల్ రావిపూడి హౌస్‌లోకి వెళ్లి సందడి చేయడం, హీరోయిన్ల డ్యాన్స్ ఫర్‌ఫామెన్స్‌లు, తమన్ మ్యూజిక్ షోతో కలిపి ఈ ఎపిసోడ్ అత్యంత ఘనంగా జరిగింది.

గత బిగ్‌బాస్ 3 ఫైనల్ ఎపిసోడ్‌కు 18.29 టీఆర్‌పీ రేటింగ్స్ రాగా.. ఇప్పుడు ఈ సీజన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. గత సీజన్ గ్రాండే ఫినాలేకు కూడా నాగార్జున హోస్ట్ చేయగా.. గెస్ట్‌గా చిరంజీవి వచ్చారు.