బికినీతో హీటెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

న్యూ ఇయర్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు సినీ సెలబ్రెటీలు రెడీ అయిపోయారు. సెలబ్రెటీ ప్రేమపక్షులైతే వెకేషన్లకి వెళుతున్నాయి. తాజాగా తన ప్రియుడైన బాలీవుడ్ హీరో సిద్దార్థ్‌తో కలిసి కియారా అద్వానీ మాల్ధీవులకు చెక్కేసింది. అక్కడ తన బాయ్‌ఫ్రెండ్‌తో తెగ ఎంజాయ్ చేస్తోంది. మాల్ధీవుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అందులో భాగంగా బికినీలో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kiyara advani bikini

ఆ ఫొటోను షేర్ చేస్తూ 2021 కోసం ఎదురుచూస్తున్నా అంటూ కామెంట్ చేసింది. సిద్దార్థ్‌తో కియారా డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వీరిద్దరు ఎప్పుడూ కన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు కలిసి మాల్దీవులకు వెళ్లడంతో.. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు కన్ఫామ్ అయిపోయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించిన బ్యూటీ.. ఆ తర్వాత రాంచరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తోంది.