ధిమాఖ్ ఖరాబ్ ఫుల్ వీడియో సాంగ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కలయికలో వచ్చిన ఫస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆల్ సెంటర్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బీ సీ సెంటర్స్ లో వసూళ్ల వర్షమే కురిపించింది. కొన్ని సినిమాలకి అన్నీ అలా కలిసొస్తాయి అంటారు కదా, ఇస్మార్ట్ శంకర్ విషయంలో జరిగింది అదే. సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, గ్లామర్ అన్నీ కలిసి ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడంలో కీ రోల్ ప్లే చేశాయి. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడంతో పూరి ఈజ్ బ్యాక్ అనే కాంప్లిమెంట్స్ వినిపించాయి. పూరి టేకింగ్ కి, రామ్ యాక్టింగ్ కి ప్రాణం పోసింది మాత్రం మణిశర్మ సంగీతమే. చాలా కాలంగా లైట్ మ్యూజిక్ ఇస్తూ వచ్చిన మణిశర్మ, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అద్భుతాలే సృష్టించాడు. రిలీజ్ అయిన ప్రతి పాట యూత్ ని రెచ్చిపోయి డాన్సులు చేసేలా చేసాయి. ముఖ్యంగా ధిమాఖ్ ఖరాబ్ పాటకి రామ్ స్టెప్పులు, నిధి నభా అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైనా వీడియో సాంగ్స్ కూడా బయటకి రాకపోవడంతో రామ్ అభిమానులు మేకర్స్ ని ట్యాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. వారి కోరిక 60 రోజులకి ఫలించి ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి ధిమాఖ్ ఖరాబ్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. జీ మ్యూజిక్ సౌత్‌ రిలీజ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. 24 గంటలు తిరిగే సరికి దాదాపు 4.5 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డ్ సృష్టించింది. ఇస్మార్ట్ శంకర్ అభిమానులంతా ఈ సాంగ్ ని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు.