90 తాగి హీరో చేసిన రచ్చ అంతా ఇంత కాదు

RX100 సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన కార్తికేయ, నటిస్తున్న లేటెస్ట్ మూవీ 90ml కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినీ అభిమానులని ఆకట్టుకుంది. సెప్టెంబ‌ర్ 21 కార్తికేయ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 90ml టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ మోడరన్ దేవ‌దాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. నేహా సోలంకి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్ విషయానికి వస్తే, కార్తికేయ మరోసారి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో కమర్షియల్ చేశాడని అర్ధమవుతుంది. ఫైట్స్, ఫన్ కలిసిన ఈ టీజర్ లో వచ్చిన లిక్కర్ తో నడిచే బండి గుద్దితే అడ్రస్ ఉండవు అనే డైలాగ్ బాగుంది. టీజర్ ఎండింగ్ లో అలీ కార్తికేయ మధ్య వచ్చిన సీన్ కూడా ఆకట్టుకుంది. కథ గురించి, ఇతర క్యారెక్టర్స్ గురించి పెద్దగా రివీల్ చేయకుండా కట్ చేసిన 90ml టీజర్ సినిమాకి అవసరమైన బజ్ ని క్రియేట్ చేయడంలో మాత్రం సక్సస్ అయ్యింది.