ఆదిపురుష్ కోసం రెడీ.. ప్రభాస్ లుక్ వైరల్

ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిజీబిజీగా ఉన్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే విడదులైన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ఓ ఫిల్మ్ స్టూడియోలో జరుగుతోంది.

prabhas

ఈ షూటింగ్ కోసం ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు. త్వరలో ప్రభాస్‌తో కలిసి పూజాహెగ్దే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. త్వరలో రాధేశ్యామ్ సినిమా కంప్లీట్ కానున్న క్రమంలో ఆదిపరుష్ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటికే సిద్ధమవుతున్నాడు.

తన లుక్‌ను సినిమాలోని పాత్రకు తగ్గట్లుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్‌కి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ప్రభాస్ చాలా సన్నబడ్డాడు. శరీర కండలను పూర్తిగా తగ్గించాడు. ఈ లుక్‌లో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడని అభిమానులు చెబుతున్నారు. ఆదిపురుష్ సినిమా కోసమే ప్రభాస్ ఇలా సన్నబడ్డాడని చెబుతున్నారు.