ఇస్మార్ట్ శంకర్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తెరక్కించిన సూపర్ హిట్ బొమ్మ. మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డబుల్ సిమ్ కార్డు ఉన్న హీరోగా రామ్ పోతినేని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన రామ్ ఎనర్జీకి నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా నభా నటేష్ తెలంగాణ అమ్మాయిగా సూపర్బ్ యాక్టింగ్ చేసింది. రామ్, నభా మధ్య వచ్చిన లవ్ ట్రాక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా వచ్చిన జిందాబాద్ సాంగ్ యూత్ ని ఫిదా చేసింది. ఇన్స్టాంట్ హిట్ గా నిలిచిన ఈ పెప్పీ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయ్యింది. పూరి సినిమాల్లో రెగ్యులర్ పైగా ఉండే బీచ్ సాంగ్స్ లిస్ట్ లో జిందాబాద్ కూడా చేరింది.