భారీ రేటుకు అమ్ముడుపోయిన వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు రూ.15 కోట్లకు వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక డిజిటల్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలోనే పోటీ నెలకొంది. దీంతో డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయే అవకాశముంది. పవన్ కల్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

నిన్న సంక్రాంతి సందర్భంగా విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శృతి హాసన్ ఇందులో కీలక పాత్రలలో నటిస్తోంది. ఇక నివేధా ధామస్, అంజలి కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే సమ్మర్‌కు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశముంది.