అక్కినేని హీరో ప్లాన్ మాములుగా లేదుగా

అక్కినేని నట వారసుడు, యువ సామ్రాట్ నాగచైతన్య మజిలీ ఇచ్చిన హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఎప్పుడూ ఒక సినిమా అయ్యాకే ఇంకో మూవీ చేసే నాగ చైతన్య, స్పీడ్ పెంచే పనిలో పడ్డాడు. ఒకటి సెట్స్ పై ఉండగానే మరొకటి అనౌన్స్ చేస్తూ మార్కెట్ ని ఎక్స్ప్యాండ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కలిసి లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీపై మార్కెట్ లో మంచి బజ్ ఉంది మేకర్స్ ఈ మూవీని ఓటీటీ వైపు తీసుకోని వెళ్లలేదు.

లవ్ స్టోరీ సెట్స్ పై ఉండగానే చైతన్య మొదలుపెట్టిన మరో మూవీ థ్యాంక్యూ. స్టైలిష్ మేకింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడెక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా చై, మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడానికి ఓకే చెప్పాడు. అది కూడా బాలీవుడ్ లో కావడం విశేషం. బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ఒక కీలక పాత్రలో చైతన్య కనిపించబోతున్నాడు. అన్ని అనుకున్న సమయానికి జరిగితే 2021లో చైతన్య మూడు సినిమాలతో ప్రేక్షకులని పలరించబోతున్నాడు. ముఖ్యంగా ఆమీర్ ఖాన్ మూవీ హిట్ అయితే నాగ చైతన్యకి బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడుతుంది.