మాస్ మహారాజ్ ఓటీటీలో కనిపిస్తాడా?

కరోనాతో పూర్తిగా డల్ అయిపోయిన ఫిల్మ్ ఇండస్ట్రీకి సరైన కంటెంట్ పడితే ఆడియన్స్ థియేటర్ కి వస్తారు అని నిరూపించిన సినిమా క్రాక్. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈమూవీ 2021 ని గ్రాండ్ గా ఓపెన్ చేయడమే కాకుండా దర్శక నిర్మాతలకి కావాల్సినంత నమ్మకం కలిగించింది. సరైన కథ పడితే రవితేజ బాక్సాఫీస్ దెగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వగలడో క్రాక్ మూవీ ప్రూవ్ చేసింది. గోపీచంద్ మలినేని టేకింగ్, రవితేజ యాక్టింగ్ శృతి గ్లామర్ క్రాక్ మూవీని సూపర్ హిట్ చేశాయి. దీంతో రవితేజ అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. క్రాక్ తర్వాత రవితేజ ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. టీజర్ తో ఆకట్టుకున్న ఈ మూవీకి ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి మంచి ఆఫర్ వస్తుందట.

ప్రస్తుతం సినిమా థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఖిలాడీ మేకర్స్ కి అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్ వచ్చిందట. వాళ్లు దాదాపు నలభై కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ మాత్రమే కాక… మరికొన్ని ఓటీటీ సంస్థలు ఖిలాడీ సినిమాని స్ట్రీమ్ చేయడానికి పోటీ పడుతున్నాయట. మరి గతేడాది ఉన్న సందిగ్దతని క్రాక్ తో చెరిపేసిన రవితేజ, మరోసారి థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకూ వెయిట్ చేస్తాడా లేక ఓటీటీలో దర్శనం ఇస్తాడా అనేది చూడాలి.