కొత్త సెన్సేషన్ తో విజయ్ సేతుపతి సినిమా

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేసే తాప్సి పన్ను, ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల సత్తా ఉన్న విజయ్ సేతుపతి కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే దానిపై అంచనాలు ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరినీ కలుపుతూ కథని రెడీ చేసిన డైరెక్టర్ దీపక్ సుందర్రాజన్. తాప్సి చుట్టూ తిరిగే ఈ సినిమాలో విజయ్ ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేస్తున్నా కూడా అతని క్యారెక్టర్ మూవీకి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. కోలీవుడ్ సినీ లవర్స్ తాప్సి, విజయ్ సేతుపతిల ఫ్రెష్ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కి మరింత హైప్ తెస్తూ హర్షదా విజయ్ కూడా టీంలోకి జాయిన్ అయ్యింది. ఇంతకీ ఈ హర్షదా విజయ్ ఎవరనే కదా మీ డౌట్. మనలో చాలా మంది లాంబోర్గినీ సాంగ్ చూసే ఉంటాం. ఈ పాటలో కనిపించే అమ్మాయే హర్షదా విజయ్. యూట్యూబ్ సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు విజయ్ సేతుపతి తాప్సి సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఇప్పటికే జగపతి బాబు, రాధిక శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీలో హర్షదా విజయ్ కూడా నటిస్తుందని వార్త బయటకి రాగానే సినిమా కాస్టింగ్ రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుందని కోలీవుడ్ సినీ అభిమానులు ఫీల్ అవుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత తమిళ్ సినిమాలో కనిపించనున్న తాప్సి మంచి హిట్ అందుకోవాలనుకుంటుంది.