మరో 24 గంటల్లో మోసగాళ్ల తెరదించనున్న వెంకీ మామ

టైటిల్ చూసి ఇదేదో వెంకీ నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ అనుకోకండి, లేదా వెంకటేష్ ఇంట్లో ఏమైనా జరిగిందా అని అసలు అనుకోకండి. అనుకోము కానీ మరి ఈ వెంకీ మామ ఎవరి మోసం బయట పెడుతున్నాడో చెప్పు అంటారా… అదేం లేదండి మంచు విష్ణు చాలా గ్యాప్ తీసుకోని చేస్తున్న హాలీవుడ్ స్టాండర్డ్ సినిమా మోసగాళ్లు. కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్న ఈ మూవీపై మంచు అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. చాలా రోజులుగా మోసగాళ్ల ప్రాజెక్ట్ తో ఊరిస్తూ వస్తున్న విష్ణు, ఈ మూవీ ప్రొమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశాడు.

ఈ ప్రొమోషన్స్ లో భాగంగానే వెంకటేష్ తో మోసగాళ్లు సినిమాకి సంబందించిన ఇంపార్టెంట్ అప్డేట్ ని రేపు ఉదయం 10గంటలకి రిలీజ్ చేయించనున్నారు. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి Raise Of Mosagalluని వెంకీ మామ రేపు ఎలా బయట పెడతాడో చూడాలి.