ఎన్టీఆర్ కి కరోనా… అభిమానులకి సందేశం…

ట్రిపుల్ ఆర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసి బిజీ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా తెలుపుతూ తారక్ ట్వీట్ చేశాడు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే ఫ్యామిలీ అంత ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపిన ఎన్టీఆర్, తాను క్షేమంగా ఉన్నానని కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. గత కొన్ని రోజులుగా తనతో టచ్ ఉన్న అందరినీ కోవిడ్ టెస్ట్స్ చేయించుకోమని ఎన్టీఆర్ సూచించాడు.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ తీసుకోని యూనిట్ అంతా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఈ కరోనా రెస్ట్రిక్షన్స్ తగ్గే లోపు ఎన్టీఆర్ కూడా కోలుకోని తిరిగి ఆర్ ఆర్ ఆర్ బాలన్స్ షూట్ కంప్లీట్ చేయాలని టీమ్ ఎదురు చూస్తున్నారు.