తాతినేని అన్నపూర్ణ కన్ను మూత!!

సీనియర్ నిర్మాత, దర్శకుడు తాతినేని ప్రకాశరావు సతీమణి అన్నపూర్ణ ఆదివారం విజయవాడలో కొవిడ్ తో కన్ను మూశారు. ఆమెకు 91 ఏళ్లు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తాతినేని ప్రసాద్ కూడా దర్శకుడే. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలు నిర్మించారు. అన్నపూర్ణ మనవడు తాతినేని సత్య ప్రకాశ్ కూడా దర్శకుడు కావడం గమనార్హం.