మైత్రీ మూవీ మేకర్స్ మత్తు వదలరా పోస్టర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్

స్టార్ హీరోలతో, అదిరిపోయే కాంబినేషన్స్ తో సినిమాలు చేసే భారీ చిత్రాల బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న ఈ బ్యానర్, ఇప్పుడు యంగ్ టీంతో సినిమా చేస్తోంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చిన ఈ సినిమాకి మత్తు వదలరా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న మత్తు వదలరా సినిమాని రితేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా పోస్టర్ ని ఎన్టీఆర్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఎన్టీఆర్, చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలియజేశాడు. న్యూస్ పేపర్ పై ఒక వ్యక్తి పడుకోని ఉండగా, దాని చుట్టూ రకరకాల ఎలిమెంట్స్ మెన్షన్ చేస్తూ డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ రాజమౌళి కలయికలో వచ్చిన యమదొంగ సినిమాలో చిన్న ఎన్టీఆర్ గా కనిపించిన సింహా కోడూరి, మత్తు వదలరా సినిమాతో హీరోగా డెబ్యూ ఇవ్వనున్నాడు.