యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా రూపొందనున్న మల్టిలింగ్వల్ సినిమా ‘మహా సముద్రం’. తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’తో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్‌స్టోరిగా సినిమా రూపొందిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ అని ట్వీట్ చేసిన శర్వా, ఒటిటి వైపు వెళ్ళట్లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో శర్వా ఎంత అందంగా ఉన్నాడో సిద్దార్థ్ కూడా అంతే అందంగా ఉండి, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే శర్వా కన్నా అందంగా ఉండి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇప్పటికీ అతను అంత యంగ్ గా ఎలా ఉన్నాడో అనే డౌట్ రాకా మానదు.
సిద్దార్థ్… ప్రేమ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓ మై ఫ్రెండ్, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ కథా చిత్రం అంటే చాలు అందులో సిద్దార్థ్ ఉండాల్సిందే అని తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయ్యే రేంజులో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న హీరో. ఒకానొక టైములో సిద్దార్థ్ సినిమాలు చూసి ఇలాంటి అబ్బాయే బాయ్ ఫ్రెండ్ గా కావాలి అనుకున్న అమ్మాయిలెందరో. గయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ హీరో, ఆ తర్వాత కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. అప్పుడప్పుడూ డబ్బింగ్ సినిమాలతో పలకరించినా, అభిమానులని అవి అనుకున్నంతగా తృప్తి పరచలేకపోయాయి. సరైన కథ పడితే ఎప్పుడైనా తెలుగులో సినిమా చేయడానికి సిద్ధమని చెప్పిన సిద్దార్థ్, చాలా రోజుల తర్వాత మహా సముద్రం సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.