ఇదెక్కడి టీజర్ రా మావా…

టీజర్, ట్రైలర్ అనగానే హీరోయిక్ ఎలెమెంట్స్ ని మిక్స్ చేస్తూ, కథని చెప్పీ చెప్పకుండా సినిమాలోని బెస్ట్ మూమెంట్స్ ని చూపిస్తూ కట్ చేస్తారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతారు. అయితే కోలీవుడ్ నుంచి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అండ్ టీం మాత్రం టీజర్ కి కొత్త అర్ధం చెప్తూ నవరస అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. నవరసాలని తొమ్మది మంది స్టార్స్ పోట్రే చేస్తూ తెరకెక్కిన ఈ మోస్ట్ యాంటిసిపెటెడ్ యాంథాలజి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ అనౌన్స్మెంట్ టీజర్ ని బయటకి వదిలారు. స్టార్ కాస్ట్ ని వారి ఎమోషన్స్ ని మాత్రమే చూపిస్తూ కట్ చేసిన ఈ టీజర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పాలి. మణిరత్నం, జయేంద్ర ప్రెజెంట్ చేస్తున్న ఈ నవరస 9 ఎపిసోడ్స్ ని గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, గౌతం వాసుదేవ్ మీనన్, సిద్దార్థ్, ప్రకాష్ రాజ్, రేవతి, ఐశ్వర్య రాజేష్, అథర్వలు నటించారు.

సిరీస్ పేరుకు తగ్గట్లే నటుల చేత నవరసాలను పలికిస్తూ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ థీమ్ లో బయటకి వచ్చిన టీజర్, అందరికీ స్వీట్ షాక్ ఇస్తోంది. కరోనా మహమ్మారి వల్ల చితికిపోయిన సినీ కార్మికులకి అండగా నిలిచేందుకు దర్శకుడు మణిరత్నం, నిర్మాత జయేంద్ర కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ లో 6వ తేదీన స్ట్రీమ్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు.