నాగ శౌర్య సినిమాలో మెగాస్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్

యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వరుడు కావలెను, లక్ష్య సినిమాలు చేస్తున్న నాగ శౌర్య… లవర్, గాలి సంపత్ సినిమాలని డైరెక్ట్ చేసిన అనీష్ కృష్ణతో ఒక సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య 22వ చిత్రం రూపొందుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ కరోనా సెకండ్ వేవ్ కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గగానే లక్ష్య సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన నాగ శౌర్య, తాజాగా #NS22 సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేస్తూ షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫన్నీ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ పోస్టర్ లో నాగశౌర్య , ఆయన తల్లి ఉష మూల్పూరి, హీరోయిన్ సేటియా, దర్శకుడు ఉన్నారు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉష మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ మూల్పూరి దీనిని సమర్పించారు.. ఈ చిత్రంలో నాగ శౌర్య జంటగా షేర్లి సెటియా నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో మూడు సినిమాలున్నాయి.. మూడు సినిమాలు హిట్ అయ్యి హ్యాట్రిక్ ను అందుకుంటాడేమో చూడాలి.