మండపం విశేషాలన్నీ థియేటర్ లోనే…

రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపం. శ్రీధర్‌ గాదె డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ అక్టోబర్ 2020లో పూర్తయింది. టీజర్, సాంగ్స్ తో మెప్పించిన ఈ మూవీ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో సక్సస్ అయ్యింది. ముఖ్యంగా చూశానే కళ్లారా సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటకి ఇప్పటికే 5 కోట్ల 10 లక్షల వ్యూస్ వచ్చాయి. చుక్కల చున్ని పాటకి 4 కోట్ల 60 లక్షలకి పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

రిలీజ్ కి రెడీ అయిన సమయంలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో విడుదలకి అడ్డంకి వచ్చింది. దీంతో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా ఓటీటీలో వస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఎట్టిపరిస్థితుల్లో ఎస్‌ఆర్‌ కల్యాణమండపం సినిమాని ఓటీటీ వేదికగా విడుదల చేయబోమని, థియేటర్ లోనే ఎంటర్టైన్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కావాల్సినంత హైప్ క్రియేట్ చేయడంలో సక్సస్ అయిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.