ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై మెరిసిన రాశి ఖన్నా, ప్రస్తుతం గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో రూపొందుస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ నటిస్తోంది రాశి ఖన్నా. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే అక్కినేని నాగ చైతన్య – విక్రం కె కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న థాంక్యూ సినిమాలో కూడా రాశి నటిస్తోంది. ప్రస్తుతం రాశిఖన్నాకి తెలుగు కంటే తమిళంలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. దాదాపు 6 తమిళ సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అక్కడ స్టార్ డమ్ తెచ్చుకునేందుకు గ్లామర్ ట్రీట్ కూడా బాగానే ఇస్తోందట. ఇదిలా ఉంటే ఒకప్పుడు బబ్లీగా ఉండే రాశి, తనని తాను మార్చుకోని స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి ఇప్పుడు స్లిమ్ అండ్ ఫిట్ బ్యూటీగా మారింది. సుప్రీమ్ హీరోతో ప్రతి రోజు పండగే, వెంకీ మామ లాంటి సినిమాల్లో చాలా ట్రెడిషనల్ గా కనిపించనున్న రాశి, ఫోటో షూట్స్ లో మాత్రం చాలా ట్రెండీగా హాట్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ఒక ఫోటో పోస్ట్ చేసిన రాశి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది.
ఎల్లో టాప్, వైట్ ప్యాంట్ లో రాశి ఖన్నా హాట్నెస్ కే హాట్ అనేలా ఉన్నాయి. క్లివేజ్ షో అండ్ నావెల్ షో చేస్తూ లూజ్ హైర్ తో కనిపించిన రాశి నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ఒకప్పుడు చబ్బిగా ఉన్న రాశి ఫోటో, ఇప్పటి ఫోటో పక్క పక్కన పెట్టి చూస్తే… ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చూపించగలుతోంది అనిపించక మానదు. తన డెడికేషన్ కి ఎవరైనా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ట్రెడిషనల్ వెర్ లో హుందాగా కనిపించే రాశి ఖన్నా, ట్రెండీ వెర్ లో హాట్ గా కనిపిస్తోంది. ఒకే అమ్మాయిలో రెండు వేరియేషన్స్ లో ఇంత అప్పీలింగ్ గా కనిపించి మెప్పించడం ఆశ్చర్యమే.