దుల్కర్ సల్మాన్ బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన స్వప్న సినిమా

మలయాళ సూపర్ స్టార్, యంగ్ అండ్ స్టైలిష్ హీరో దుల్కర్ సల్మాన్ అంటే తెలియని వారు ఉండరు. మమ్ముట్టి లాంటి దిగ్గజ నటుడి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ తనదైన ఫాలోయింగ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కేరళలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమైన దుల్కర్ కి తెలుగు రాష్ట్రాల్లో ఫిమేల్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. మహానటి సినిమాతో దుల్కర్ ని టాలీవుడ్ కి తెచ్చిన వైజయంతి మూవీస్ స్వప్న సినిమా ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమగాధ ఫేమ్ హను రాఘవపూడి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. నేడు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సంధర్భంగా మేకర్స్ ఈ మూవీ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. పీరియాడికల్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో దుల్కర్ లెఫ్ట్నెంట్ రామ్ గా కనిపించబోతున్నాడు. గ్లిప్మ్స్ లో దుల్కర్ స్క్రీన్ ప్రేజేన్స్ కి ఎవరైనా ఫిదా కావలసిందే. మంచు కొండల ప్రాంతంలో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ చిన్న గ్లిమ్ప్స్ తోనే హను రాఘవ తన మేకింగ్ స్కిల్స్ ని చూపించాడు. ముఖ్యంగా సిలౌట్స్ లో అతను వాడిన లైటింగ్ ఫ్రేమ్ బ్యూటీని తెచ్చింది. విశాల శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.