ట్రైలర్ కిర్రాక్ ఉంది… కిరణ్ అబ్బవరం కేక పెట్టించాడు…

రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపం. శ్రీధర్‌ గాదె డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ అక్టోబర్ 2020లో పూర్తయింది. టీజర్, సాంగ్స్ తో మెప్పించిన ఈ మూవీ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో సక్సస్ అయ్యింది. ముఖ్యంగా టీజర్ ఎండ్ లో ఒక పెద్దాయన తాగుతారు కదా బాబు అని హీరోని అడిగితే హా తాగుతాం అంకుల్, అది ఇది అని లేదు అంకుల్ ఏ బ్రాండ్ అయినా ఓకే అనే డైలాగ్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత చూసానే కళ్లారా సాంగ్ కూడా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసింది.

రిలీజ్ కి రెడీ అయిన సమయంలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో విడుదలకి అడ్డంకి వచ్చింది. దీంతో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా ఓటీటీలో వస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కరోనా తగ్గి థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకూ ఆగి ఫైనల్ గా ఆగష్టు 6న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని షురు చేస్తూ ఎస్ ఆర్ కళ్యాణ మండపం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 40 సెకండ్లు ఉన్న టైటిల్ ఫస్ట్ సెకండ్ నుంచి ఎండ్ వరకూ ఎంటర్టైన్ చేస్తూనే హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం చాలా యాక్టివ్ గా కనిపించాడు, పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగించాడు. ప్రియాంక అందంగా కనిపించింది. ట్రైలర్ లో ముఖ్యంగా సాయి కుమార్ గురించి చెప్పుకోవాలి, సరైన రోల్ పడితే పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టే సాయి కుమార్ ఎస్ ఆర్ కళ్యాణమండపంలో కిరణ్ అబ్బవరంకి ఫాదర్ రోల్ ప్లే చేశాడు. ఈ ఇద్దరి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ పడినట్లు ఉన్నాయి. స్టొరీ స్కీన్ ప్లే డైలాగ్స్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు రాసుకున్న కిరణ్ అబ్బవరం, “డబ్బులదేముందిరా….వస్తాయి… పోతాయి.. కానీ మనం బ్రతుకుతున్న బతుకు ముఖ్యం కధ… నేనెంత పొగ్గొట్టినా ఎవడిది రూపాయి తినలా…” అనే డైలాగ్ చాలా బాగా రాసాడు. మొత్తానికి ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం అండ్ టీం ఆగస్ట్ 6న థియేటర్స్ లో ఎలా అట్రాక్ట్ చేస్తారో చూడాలి.