సోనూ సూద్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వనున్నాడా?

Sonu Sood

లాక్ డౌన్ లో సోనూ సూద్ చేసిన సహాయలను దేశం ఎప్పటికి మరచిపోదనే చెప్పాలి. సొంత గూటికి చేరాలని లక్షలాది మంది వలస కూలీలు రోడ్డుకెక్కడంతో నేనున్నాను అంటూ సోనూ సూద్ వారి కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి గమ్యానికి చేర్చాడు. ఆ సమయంలో కష్టం నుంచి బయటపడిన ప్రతి ఒక్కరు సోనూ సూద్ దేవుడిలా వచ్చాడు అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

లాక్ డౌన్ లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అలాగే సాయం పొందిన తరువాత వారి కళ్ళలో ఆనందం వంటి విషయాలు తనను ఎంతో ఆనందానికి గురి చేశాయని అందుకే లైఫ్ చెంజింగ్ అనే పుస్తక రూపంలో వాటిని చెప్పే ప్రయత్నం చేస్తానని సోనూ సూద్ ఇటీవల వివరణ ఇచ్చాడు. అయితే సోనూ సూద్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా అనే పుకార్లు ఎప్పటిలానే ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ విషయంపై కూడా ఈ స్టార్ యాక్టర్ పుస్తకం ద్వారా క్లారిటీ ఇవ్వనున్నాడనే టాక్ వస్తోంది.