‘చెక్’ నిజాం రైట్స్ వరంగల్ శ్రీనుకే

హీరో నితిన్ ప్రస్తుతం చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఫిబ్రవరి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు గత కొద్దిరోజుల క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుండగా.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఈ సినిమా నిజాం రైట్స్‌ను రూ.5.4 కోట్లకు కొనుగోలు చేశాడు.

CHECK NIZAM RIGHTS

ఇక ఆంధ్రా, సీడెడ్ రైట్స్‌ను కేఎఫ్‌సీ బ్యానర్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. ఇక శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్‌ను జెమిని టీవీ తీసుకుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఇటీవల విడుదల చేసిన చెక్ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టించింది. భవ్య ఆనంద్ ప్రసాద్, అన్నా రవి ఈ సినిమాను నిర్మించగా.. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. రకుల్ లాయర్‌గా ఇందులో నటించగా.. ప్రియా ప్రకాష్ వారియర్ నితిన్ లవర్‌గా నటించింది.