‘విశ్వంభర’ షూటింగ్ విశేషాలు

మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రముఖ పాత్రలలో నటిస్తూ మన ముందుకు రాబోతున్న సినిమా విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే వరుస అప్డేట్ లు రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. సినిమాలోని ప్రముఖ షూటింగ్ భాగం అంత ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే మేకర్స్ ఈ జులై నెలకి షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందువలన సీజీ ఇంకా వీ ఎఫ్ఎక్స్ కు తగిన సమయం కేటాయించవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.