సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గం… గం… గణేశా’

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నయన్ సారిక ముఖ్య పాత్రలో నటిస్తూ మన ముందుకు వస్తున్న సినిమా గం… గం… గణేశా. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రాజ్ అర్జున్, ఇమ్మానుయేల్ ఈ చిత్రంలో నటించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈరోజు ఈ సినిమా సెన్సార్ పూతిచేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ పొందింది.