Tollywood: నాని నో అన్నాడు.. వైష్ణ‌వ్‌తేజ్‌ ఓకే చేశాడు!

Tollywood: ఉప్పెన చిత్రంతో మెగాల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ టాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. దీంతో ఆయ‌న‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.. తాజాగా మ‌రో నూత‌న ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌నున్నారు వైష్ణ‌వ్‌.

Vishnavtej Latest Movie

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ క‌థ ముందుగా న్యాచుర‌ల్‌స్టార్ నాని వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌.. ఈ క‌థ త‌న‌కు సూట‌వుద‌ని.. చెప్ప‌డంతో.. ఉప్పెన హిట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వైష్ణ‌వ్‌ను సంప్ర‌దించార‌ట‌.. వెంట‌నే అత‌ను ఓకే చేసిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతుంది..