ఇంటెన్సిఫైడ్ డ్రామాగా విశాల్ నటించిన రత్నం మూవీ ఏప్రిల్ 26న విడుదల

విశాల్ నటిస్తున్న రత్నం సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ గతంలో విడుదల కావడం జరిగింది. విశాల్ సినీ కెరియర్ లోనే ఓ పవర్ఫుల్ టీజర్ల ఈ సినిమా యొక్క టీజర్ కనిపించింది. డైరెక్టర్ హరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మీద సినీ ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో హరితో కలిసి పూజ సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడు హరి గతంలో సింగం సిరీస్, స్వామి & స్వామి స్క్వేర్ మరెన్నో సినిమాలను దర్శకత్వం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మ్యూజిక్ విషయానికి వస్తే తెలుగునాట రాక్ స్టార్ డి.ఎస్.పి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. కార్తికేయ సంతనం, అలంకార్ పాండియన్ ప్రొడ్యూసర్లుగా ప్రకృతి తీసుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.