విజ‌య్‌సేతుప‌తి జోడీగా క‌త్రీనాకైఫ్‌..

త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తి పెద్ద స్టార్‌.. త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల్లో కూడా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహరెడ్డి చిత్రంలో విజ‌య్‌సేతుప‌తి కీల‌క‌పాత్ర పోషించి.. తెలుగులో కూడా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న పంజా వైష్ణ‌వ్‌తేజ్ న‌టిస్తున్న‌ ఉప్పెన చిత్రంలో కూడా ఓ కీల‌క‌పాత్ర చేస్తున్నాడు విజ‌య్‌సేతుప‌తి.

vijaysethupathiii

ప్ర‌స్తుతం ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ నేప‌థ్యంలో విజ‌య్‌సేతుప‌తి, బాలీవుడ్ న‌టి క‌త్రినకైఫ్‌ కాంబినేష‌న్‌లో, గ‌తంలో హిందీలో అంధాదున్ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతుంద‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో అగ్ర‌తార‌గా బిజీగా ఉన్న క‌త్రీనా కైఫ్.. ముందు ద‌క్షిణాదిన ముఖ్యంగా తెలుగులో కొన్ని సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే.