అఖిల్‌కి అభిమాని నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన అఖిల్.. రన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో హీరోయిన్ మోనాల్‌తో నడిపిన లవ్ ట్రాక్‌తో అఖిల్ గుర్తింపు పొందాడు. గతంలో అఖిల్ పలు సీరియళ్లలో నటించాడు. కానీ అంతగా గుర్తింపు పొందలేదు. కానీ బిగ్‌బాస్ 4తో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడి ప్రవర్తనకు చాలామంది అభిమానులుగా మారారు.

fan surprise gift akhil

బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అఖిల్‌కు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని అఖిల్ బయటపడలేదు. కానీ అఖిల్‌కి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉందని తాజా ఘటనను బట్టి చూస్తూ తెలుస్తోంది. అఖిల్‌కు విజయవాడకి చెందిన జయలక్ష్మీ అనే యువతి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.

విజయవాడకి చెందిన జయలక్ష్మీ అనే అమ్మాయి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందని, తన మీద ఎందుకు ఇంత ప్రేమ అని తెలిపాడు. నేను అంతగా ఏం చేశానో కూడా తనకు అర్ధం కావడం లేదని, అభిమాని ప్రేమకు రుణపతి ఉంటానని చెప్పాడు.