మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి పెరరివళన్‌ను విడుదల చేయాలని తమిళ హీరో విజయ్ సేతుపతి ఫేస్‌బుక్‌లో డిమాండ్ చేశాడు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు. దర్యాప్తు సంస్థ ఫైనల్ రిపోర్టు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని, పెరరివళన్‌ను వెంటనే విడుదల చేయాలని విజయ్ సేతుపతి కోరాడు. పెరరివళన్‌ను విడుదల చేయాలని తల్లి అర్పుతమాల్ 29 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసింది.
ఆమె పోరాటం విజయంవంతం కావాలంటే పెరరివళన్‌ను విడుదల చేయాలని విజయ్ సేతుపతి కోరాడు. పెరరివళన్‌ను విడుదల చేయాలని ఇప్పటికే డైరెక్టర్ భారతీరాజా, సత్యరాజ్, ప్రకాజ్ రాజ్ కోరారు.
పెరరివళన్ 19 సంవత్సరాల వయస్సులో అరెస్ట్ అయి అప్పటినుంచి జైల్లో ఉన్నాడు. ఈ కేసులో అతడికి తొలుత మరణశిక్ష విధించారు. అయితే తర్వాత దానిని జీవితఖైదుగా మార్చారు. పెరరివళన్‌తో సహా ఏడుగురు నిందితులను విడుదల చేయాలని 2014లో జయలలిత ప్రభుత్వం సిఫారసు చేసింది. త్వరలో తమిళనాడు ఎన్నికలు రానున్న క్రమంలో ఈ కేసు మరోసారి తెరపైకి రావడం గమనార్హం.