అదృష్టాన్ని వదులుకున్న విజయ్ సేతుపతి

బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. కానీ అమీర్‌ఖాన్‌తో కలిసి నటించే అవకాశాన్ని తమిళ హీరో విజయ్ సేతుపతి వదులుకున్నాడు. చేతిలోకి వచ్చిన అదృష్టాన్ని విజయ్ సేతుపతి వదులుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చినా.. బీజీ షెడ్యూల్స్ ఉండటంతో విజయ్ సేతుపతి ఆసక్తి చూపలేదు.

vijay setupati

అమీర్ ఖాన్ హీరోగా ప్రస్తుతం ‘లాల్ సింగ్ ఛధా’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌‌లో బుబ్బా రోల్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి నటిస్తే బాగుంటుంద‌ని అమీర్‌ఖాన్ భావించాడట. దీని కోసం విజయ్ సేతుపతిని సంప్రదించగా.. అతడు నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఈ పాత్రలో కొంచెం బొద్దుగా కనిపించారట. కాకపోతే ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు విజయ్ సేతుపతి రెడీగా లేదట. అందుకే అమీర్ ఖాన్ సినిమాలో నటించేందుకు ఆఫర్ వచ్చినా విజయ్ సేతుపతి తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పాత్రకు టీవీ నటుడు మానవ్ విజ్‌ను అమీర్ ఖాన్ ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది