నిహారిక లవ్ స్టోరీ సీక్రెట్స్.. అలా ప్లాన్ చేశారు

మెగా డాగర్ నిహారిక పెళ్లి నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు సినీ సెలబ్రెటీలు ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఒక ఫొటో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. గుంటూరు ఐజీ అయిన జోన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు జోన్నలగడ్డ చైతన్యను నిహారిక లవ్ మ్యారేజ్ చేసుకోగా.. పెద్దల సమక్షంలో వైభవంగా ఈ పెళ్లి జరిగింది.

niharika

అయితే నిహారిక, చైతన్యల లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది?.. ఎలా కలిశారు? అనే విషయాలు చాలామందికి తెలియవు. దీంతో దీనిపై అనేక రూమర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిహారిక, చైతన్యల లవ్ గురించి మెగా బ్రదర్ నాగబాబు కీలక విషయాలు బయటపెట్టాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న నిహారిక,చైతన్యలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ఒక ప్లాన్ చేశారట. నాగబాబు జూబ్లీహిల్స్‌లోని అపోలో జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్న చైతన్య.. నాగబాబుకు దగ్గరయ్యేందుకు ఆ జిమ్‌లో చేరాడట.

ఆ తర్వాత నాగబాబుకు దగ్గరయ్యేందుకు రోజూ విష్ చేస్తూ చేస్తుండేవాడట. అలాగే నాగబాబును ఇంప్రెస్ చేయడం లాంటి పనులు చేస్తూ ఉండేవాడట. అలా నాగబాబుకు చైతన్య దగ్గరయ్యాడు. దీని తర్వాత తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి నిహారిక చెప్పగా.. చైతన్య ఫ్యామిలీ గురించి నిహారిక కుటుంబసభ్యులు ఆరా తీయడం మొదలుపెట్టారట. చైతన్య తండ్రి గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు అని తేలియడంతో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రభాకర్ రావుతో చిరంజీవితో మంచి అనుబంధం ఉండటంతో పెళ్లికే వెంటనే ఒకే చెప్పామని నాగబాబు తాజాగా వెల్లడించాడు.