సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ న్యూ రికార్డ్

యువ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. వరుస బాక్సాఫీస్ హిట్స్ తో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ గత రెండేళ్లలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నాడు. ఇక ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో 9మిలియన్స్ ఫాలోవర్స్ తో టాలీవుడ్ నుంచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

అల్లు అర్జున్ 8.7 మిలియన్ ఫాలోవర్స్ తో విజయ్ కి పోటీగా వస్తున్నాడు. ఇక ఆ తరువాతి స్థానాల్లో మహేష్, ప్రభాస్, రానా కొనసాగుతున్నారు. ఏదేమైనా విజయ్ అర్జున్ రెడ్డితో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. నార్త్ ఆడియెన్స్ కూడా ఈ కుర్ర హీరో టాలెంట్ కి ఫిదా అవుతున్నాడు. ఇప్పుడే ఈ రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నాడు అంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా తరువాత ఇంకా ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటాడో చూడాలి. అలాగే సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.