పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ హ్యాట్రిక్ మూవీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయలనుకునేవారు ఇప్పుడు అతి తక్కువ సమయంలో ఫినిష్ అయ్యే కథ ఉంటే ఈజీగా ఆయనతో ఛాన్స్ అందుకోవచ్చు. కథలో మంచి సందేశం ఉంటే పవన్ పెద్దగా ఆలోచించకుండా సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఇక పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు అందుబాటులో ఉంటే పవన్ ఉరుకుంటాడా?. ఇటీవల వీరి మధ్య ఒక కథ గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

బద్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్ ఆ తరువాత చాలా ఏళ్లకు కెమెరా మెన్ గంగతో రాంబాబు అనే సినిమా చేశాడు. ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మూడవసారి వీరిద్దరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి పవర్ఫుల్ మెస్సేజ్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.