రౌడీ ఫ్యాన్స్‌ స్పంద‌నకు భావోద్వేగ‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

పూరి జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్ లాంటీ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుండ‌గా.. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను నిన్న చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఇందులో విజ‌య్ ఒక ఫైట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నాడు. దీంతో రౌడీ ఫ్యాన్స్ ర‌చ్చ మామూలుగా చేయ‌లేదు. పోస్ట‌ర్‌కు పాలాభిషేకం కాదు.. ఏకంగా బీర్లాభిషేకం చేస్తున్నారు.

liger response

సినిమా టైటిల్‌ను టాటూగా వేయించుకుని త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. రౌడీ ఫ్యాన్స్ క‌టౌట్ ఏర్పాటు చేసి బీర్‌తో అభిషేకం చేశారు. కేక్స్ క‌ట్స్ చేశారు. దీంతో దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ సంతోషంతో పొంగిపోతున్నాడు. ఓ స‌మ‌యంలో ఈ సినిమా కోసం తాను ప‌డిన శ్ర‌మ‌ను ఎవ‌రైనా గుర్తిస్తారా.. అస‌లు, థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తారా? అని భావించా.. కానీ అభిమానుల నుంచి వ‌స్తున్న స్పంద‌న చూస్తుంటే.. ఎంతో సంతోషంగా ఉందని.. నా ప్రియ‌మైన అభిమానుల‌కి నిన్న మీరు న‌న్ను ఎంతో సంతోష‌క‌ర‌మైన భావోద్వేగాల్లో ముంచెత్తారు. లైగ‌ర్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాక సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న దృశ్యాలు న‌న్ను క‌దిలించాయి అని విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాను పూరితో పాటు ఛార్మి, క‌ర‌ణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా..ఇందులో విజ‌య్ స‌ర‌స‌న హిందీ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది.