ఆ హీరోతో మోనాల్ లవ్ ఎఫైర్.. ఐదేళ్ల తర్వాత బ్రేకప్

బిగ్‌బాస్ 4తో తెలుగువారందరికీ పరిచయమైంది గుజరాతీ బ్యూటీ మోనాల్. అంతకుముందు నాలుగైదు తెలుగు సినిమాల్లో ఈమె నటించినా.. అంతగా పేరు రాలేదు. కానీ బిగ్‌బాస్ 4తో ఒక్కసారిగా మోనాల్ ఫేమస్ అయిపోయింది. ఇటీవల వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక పాటలో డ్యాన్స్ వేసిన మోనాల్.. ప్రస్తుతం స్టార్ మా టీవీలో డ్యాన్స్ + షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

monal gajjar love aaryan

అయితే పలు ఇంటర్వ్యూలలో తన మాజీ ప్రియుడితో జరిగిన లవ్ బ్రేకప్ స్టోరీని బయటపెట్టిన మోనాల్.. అతడి పేరు మాత్రం బయటపెట్టలేదు. కానీ తాజాగా తన మాజీ ప్రియుడి పేరును మోనాల్ బయటపెట్టింది. అతడెవరో కాదు.. మలయాళీ హీరో ఆర్యన్. అతడితో దాదాపు ఐదేళ్లకుపైగా డేటింగ్‌లో ఉన్నానని, కానీ కొన్ని అనివార్య వల్ల ఇద్దరం విడిపోయామని తెలిపింది. లవ్ బ్రేకప్‌తో తీవ్ర ఆవేదనకు గురై గుజరాత్ వెళ్లపోయానని, ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఇక సౌత్ ఇండస్ట్రీకి రాలేకపోయానంది.