బాలయ్య మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి దీనిని నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపిస్తుండగా.. ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

SUNIL SHETTY WITH BALAKRISHNA

దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే విడదులైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిని తీసుకున్నట్లు తెలుస్తోంది.