సీనియర్ నటి ఇంట్లో కరోనా పాజిటివ్

Veteran actress Rekha under home quarantine

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రోజురోజుకి కరోనా భయాలు ఎక్కువవుతున్నాయి. బచ్చన్ ఫ్యామిలీ ఉహీంచని విదంగా కరోనా భారిన పడటంతో ముంబైలో మిగతా స్టార్స్ లో కొంత ఆందోళన మొదలైంది. ఇక సీనియర్ నటి రేఖ ఇంట్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. దీంతో ముంబై మున్సిపల్ కార్పోరేషన్ రేఖకు సంబంధించిన ఒక బంగ్లాకు సీల్ వేశారు.

రేఖ బంగ్లాకు సెక్యూరిటీ గార్డ్ కి కరోనా రావడంతో అతనిని క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. అలాగే రేఖకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమె చేతికి కరోనా క్వారంటైం స్టాంప్ వేసినట్లు తెలుస్తోంది. ఇక రేఖ ఇంట్లో పని చేసే మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని రావడంతో అధికారులు వారిని సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం ముంబై నగరంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది.

ఇటీవల అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తో పాటు వారి కూతురు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు వారిని క్వారంటైన్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.